Andhra Pradesh CM: ముఖ్యమంత్రి జగన్‌పై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ జగన్ చిన్నవాడైనా చిరుత పులి.. ఆయన అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు విశాఖపట్నం జిల్లాలోని కోటవురట్ల మండలం పాములవాకలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్‌పై ప్రశంసలు గుప్పించారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు జగన్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యానికి అధికా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది కచ్చితంగా జగనే అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉద్ఘాటించారు. ఇదే సమయంలో పార్టీలో నేతల అంసతృప్తి ఆయన స్పందించారు. గ్రామ స్థాయిలో పార్టీ పెద్దలకు ప్రాధాన్యత తగ్గిందనే విషయంలో ఏమాత్రం అర్థం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కొంత గ్యాప్ వచ్చిందన్నారు. ప్రస్తుతం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
Also read:
first techer in india : భారత్ లో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే.