
గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు శవమై కనిపించాడు… తీరా ఆరాతీస్తే అతని యజమానే అతన్ని చంపినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.. యజమాని భార్యతో సన్నిహితంగా ఉండటమే ఆ యువకుడికి శాపం అయిందా… అక్రమ సంబంధాన్ని అంట గట్టి అతన్ని చంపేశారా అనే దానిపై ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు… కడపలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురై ఒంటిమిట్ట మండలంలోని సోమశిల ముంపు గ్రామం కోటపాడు సమీపంలో శవమై కనిపించాడు.. అయితే దీనికి సంబంధించి పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేశారు.. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుపతి జిల్లా చిట్వేలు మండలం సిద్ధారెడ్డి గారి పల్లెకు చెందిన వంశీ అనే యువకుడు కడప రిమ్స్ సమీపంలో నివాసం ఉంటున్న రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నళ్ళ క్రితం రామసుబ్బారెడ్డి జీవన ఉపాధి కోసం కువైట్ కి వెళ్ళాడు. అయితే అతని భార్య ఆన్లైన్లో వ్యాపారం చేస్తుండడంతో వంశీ డ్రైవర్ గా అక్కడే కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన రాం సుబ్బారెడ్డికి తన భార్య డ్రైవర్ వంశీతో చనువుగా ఉండటాన్ని చూశాడు. దీంతో అనేక పర్యాయాలు అనుమానంతో ఇదే విషయంపై భార్యతో తరచూ గొడవపడేవాడు.. ఈ క్రమంలోనే రామసుబ్బారెడ్డి వంశీని హత్య చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వంశీ వంటిపై కత్తిపోట్లు ఉండడం అలాగే డెడ్ బాడీ కవర్లో చుట్టి ఉండడంతో రామ్ సుబ్బారెడ్డి పైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక పదవ తేదీన వంశీకి తన తండ్రి మునయ్య ఫోన్ చేసినా కలవకపోవడం.. అదే సమయంలో రామ్ సుబ్బారెడ్డికి ఫోన్ చేసిన అతను స్పందించకపోవడంతో కడప పోలీసు స్టేషన్ లో వంశీ తండ్రి మునయ్య ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలోనే నిన్న వంశీ మృతదేహం సోమశీల గుంపు గ్రామం వద్ద దొరకటం.. ఒంటిపై అనేక రక్తపు గాయాలు కత్తిపోట్లు ఉండడంతో ఇది హత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే.. దీని వెనుక రామసుబ్బారెడ్డి ఉన్నాడన్న విషయంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన భార్యతో చనువుగా ఉంటున్నాడని విషయం తట్టుకోలేక రామ్ సుబ్బారెడ్డి ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..