Thunderstorm : ‘ఆ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున పిడుగులు పడే ప్రమాదం.. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు’

|

May 18, 2021 | 5:30 PM

Thunderstorm warnings : ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు పిడుగు హెచ్చరికలు జారీ అయ్యాయి.

Thunderstorm :  ఆ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున పిడుగులు పడే ప్రమాదం..  చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు
Thunder
Follow us on

Thunderstorm warnings : ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు పిడుగు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల, కంభం, మార్కాపురం, బేస్తవారిపేట, తర్లుపాడు, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, కనిగిరి, పెదచెర్లోపల్లి, పామూర్, చంద్రశేఖరపురం. అటు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, ఉదయగిరి మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి అని ఆయన సూచించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అని విపత్తుల శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

Read also : Bhatti : ‘పాత సినిమాల పాతాళ భైరవి లా సీఎం, సీఎస్.. సమావేశంలో బిస్కెట్స్ తినుకుంటూ.. కనిపిస్తున్నారు’ : భట్టి