తిరుమల అనగానే ఆధ్యాత్మిక భావన ఉట్టిపడుతుంది. ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒకసారైనా స్వామి దర్శనానికి నోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చిరుతల సంచారం ప్రతి ఒక్కరికీ భయాందోళన కలిగిస్తోంది. దీంతో నడక దారిలో వెళ్లేందుకు భక్తులు జంకుతున్నరు. టీటీడీ భక్తుల భద్రత దృష్ట్యా ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్లే వారి చేతికి ఒక కర్రను కూడా అందిస్తోంది. అయితే మరిన్ని ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టే అంశం పై కసరత్తు చేస్తోంది. మన్నటి వరకూ అలిపిరి మెట్ల మార్గంలో సంచరించిన చిరుతలు ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో తిరుగుతున్నట్లు సమాచారం.
ఈరోజు తిరుమల శ్రీవారి మెట్టు నడకమార్గంలో మరో చిరుత కనిపించింది. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు స్ధానికులు గుర్తించారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు పులివెందులకు చెందిన భక్తులు. చిరుతను చూసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు.. చిరుత ఎక్కడుందో గుర్తించేందుకు రంగంలోకి దిగారు. నడకదారిలో తిరుమలకు వెళ్లాలంటే గుంపులుగా వెళ్లాలని సూచిస్తోంది టీటీడీ. చిరుత సంచారం కారణంగా వాటర్ హౌస్ వద్ద భక్తులను కొద్దిసేపు నిలిపి గుంపులుగా పంపుతున్నారు సెక్యూరిటీ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..