Pawan Kalyan: ఆ విషయంలో అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్.. నివేదిక కోరిన పవన్ కళ్యాణ్..

|

Jun 21, 2024 | 5:47 PM

పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్ధిక సంఘం నిధులు సీఎఫ్.ఎం.యస్‎కు ఎందుకు మళ్లించారని అధికారులను నిలదీశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, పురపాలకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు.

Pawan Kalyan: ఆ విషయంలో అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్.. నివేదిక కోరిన పవన్ కళ్యాణ్..
Deputy Cm Pawan Kalyan
Follow us on

పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్ధిక సంఘం నిధులు సీఎఫ్.ఎం.యస్‎కు ఎందుకు మళ్లించారని అధికారులను నిలదీశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, పురపాలకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాలకు మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఛీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను నిధుల మళ్లింపు పై ప్రశ్నించారు.

కేంద్రం పంపిన నిధులు మళ్లింపుపై పవన్ కళ్యాణ్ నిలదీయడంతో నీళ్లు నమిలిన అధికారులను నిలదీశారు. గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడలో డయేరియా వచ్చి మనుషులు చనిపోవడంపై అధికారుల పనితీరును ప్రశ్నించారు. వాటికి నిధులు లేవని అధికారులు చెప్పడంతో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎందుకు మళ్లించారని అధికారులను అడిగారు. ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారో కూడా తనకు నివేదిక ఇవ్వాలని ఛీఫ్ సెక్రటరీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..