ఢిల్లీ పేలుళ్లు.. శ్రీహరికోట సమీపంలోని ఆ ఆలయంలో తనిఖీలు! ఎందుకంటే..?

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష కేంద్రం, ప్రముఖ ఆలయాలపై ఉగ్రదాడుల ముప్పు ఉందని అనుమానిస్తున్నారు. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయం వద్ద నిఘా పెంచారు. భక్తుల ముసుగులో ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో తనిఖీలను ముమ్మరం చేశారు.

ఢిల్లీ పేలుళ్లు.. శ్రీహరికోట సమీపంలోని ఆ ఆలయంలో తనిఖీలు! ఎందుకంటే..?
Sullurpeta Temple Security

Edited By: SN Pasha

Updated on: Nov 14, 2025 | 2:09 AM

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు, ఎయిర్‌ పోర్ట్‌లు, పోర్టు లతో పాటు అంతరిక్ష కేంద్రాలపై దాడులు జరుగుతాయనే ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఇస్రో లో కీలక భాగమైన శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తో సమీపంలోని ప్రముఖ ఆలయాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీలో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పేలుళ్ళు తర్వాత దేశంలోని మిగిలిన చోట్ల విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్ పై గతంలో అనేక ఉగ్ర దాడులు జరిగాయి. ఓ చోట దాడులు జరిగిన వెంటనే అందరి దృష్టి మరల్చి ఇతర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగిన ఉదంతాలు గతంలో అనేకం చూశాం. ప్రస్తుతం తాజాగా ఢిల్లీలో పేలుళ్ళు తర్వాత హోం శాఖ అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే సంస్థలతో పాటు, దేశానికి కీలకమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట కు భద్రత పెంచారు. అలాగే పరిసరాల్లోని ప్రముఖ ఆలయాలను టార్గెట్ చేసే అవకాశం ఉందన్న అనుమానంతో సూళ్లూరుపేట లోని ప్రముఖ ఆలయం శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి.

సులూరుపేట జంగాలమ్మ ఆలయానికి దక్షిణాదిన అన్ని రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. కొంతమంది భక్తులు దర్శనం చేసుకుని వెళ్లిపోవడమే కాకుండా రాత్రి వేళ అక్కడే ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసి వెళుతుంటారు. ఆలయంలో నిద్ర వచ్చేసి వెళ్లడం ద్వారా తమకున్న ఏడు తొలగిపోయి మంచి జరుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతుంటారు. భక్తుల ముసుగులో ఉగ్రముఖలు ఎక్కడ తలదాచుకొని దాడులకు తెగబడే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీస్ అధికారులు, ఎస్పీఎఫ్ బలగాలు ఆలయం పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయానికి శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం అతి దగ్గరగా ఉంది.

శ్రీహరికోటను టార్గెట్ చేయాలనుకున్న ఉగ్ర మూకలు భక్తుల రూపంలో సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం అలాగే సూళ్లూరుపేటలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ లో తిష్ట వేసి దాక్కొని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి భద్రతను మరింత కట్టు తీయటం చేశారు. తమిళనాడు సరిహద్దుల సులూరుపేట ఉండడంతో సరిహద్దులోని ఆరంభాగం తడప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు సూళ్లూరుపేట పట్టణంలో అడుగడుగునా తనిఖీలు చేపడుతూ ఆలయానికి వచ్చే అనుమానం ఉన్న వారి కదలికలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి