Paritala Ravi Death Anniversary: నేడు పరిటాల రవీంద్ర వర్థంతి.. ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి 16వ వర్ధంతి సందర్భంగా ఆదివారం భారీ ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురం (రవి స్వగ్రామం)లో

Paritala Ravi Death Anniversary: నేడు పరిటాల రవీంద్ర వర్థంతి.. ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

Updated on: Jan 24, 2021 | 11:45 AM

Paritala Ravi Death Anniversary:  మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి 16వ వర్ధంతి సందర్భంగా ఆదివారం భారీ ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురం (రవి స్వగ్రామం)లో రవి ఘాట్ వద్ద ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రవి ఘాట్‌ను పూలతో పెద్ద ఎత్తున అలంకరించారు. ముందుగా రవి సతీమణి మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరకుని నివాళులర్పించారు. అనంతరం అభిమానులు కార్యకర్తలు ఇతర నాయకులు రవి ఘాట్‌ను సందర్శిస్తున్నారు.

జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. రవి వర్ధంతికి ఘాట్ వద్దకు వచ్చే వారి కోసం ఆయన కుటుంబ సభ్యులు భారీగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రవి వర్ధంతి కార్యక్రమం కొనసాగుతోంది. పలుచోట్ల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

Also Read: అరగంట వ్యవధిలో ఆ దంపతులు అనంతలోకాలకు.. ఇద్దరూ గుండెపోటుతోనే.. అసలు ఏం జరిగిందంటే..?