Andhra Pradesh: చేపల కోసం వల వేసిన స్థానికులకు షాక్.. బాబోయ్ దెయ్యం చేప

ఇలాంటి చేపలు... చేపల చెరువుల్లో ఉన్నాయనుకోండి.. ఒక్క చేప పిల్లను కూడా మిగలనివ్వవు. ఉప్పునీరు, మంచినీరు ఏ నీటిలోనైనా ఇది జీవనం సాగించగలదు. ఈ చేపలు ఇప్పుడు చెరువులు, కాల్వల్లో కనిపించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది.

Andhra Pradesh: చేపల కోసం వల వేసిన స్థానికులకు షాక్.. బాబోయ్ దెయ్యం చేప
Devil Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 06, 2023 | 8:13 AM

అది ఈస్ట్ గోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం నందిగూడెం గ్రామం. సన్నని జల్లులు పడుతున్నాయ్.. పొలం పనులు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. సర్లే ముసురుకు నాలుగు చేపలు పట్టుకుని పులుసు పెట్టుకుని తిందామని వారు భావించారు. అనుకున్నదే తడవుగా వల తీసుకుని.. స్థానికంగా ఉన్న వీరదమ్మ చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో బొచ్చ, బురదమట్ట.. చేపలు చిక్కాయి. అరె.. ఈ రోజు భలే చేపలు భలే పడ్డాయ్ అని అనుకున్నారు. ఈ క్రమంలోనే వలలో చేపల తీస్తుండగా.. ఓ వింత చేప కూడా తారసపడింది.

అది సుమార్ అర కేజీ బరువు ఉంటుంది. చూడటానికి వింత రంగులో భయానకంగా ఉంది. చిత్రంగా ఈ చేపకు నోరు కింద భాగంలో ఉంది. తమ ఏరియాలో ఇలాంటి చేపను గతంలో చూడలేదని.. అసలు దాని పేరు కూడా తెలీదని స్థానికులు తెలిపారు. అయితే అలాంటి.. ఇలాంటి చేప కాదండోయ్.. దెయ్యం చేప అట. అవును దీన్ని సుకర్ ఫిష్ అని కూడా అంటారని.. స్థానిక మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి చేపలు బంగ్లాదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. పుట్టిన తొలినాళ్లలో నాచు తిని.. తరువాత చిన్న చిన్న చేపల్ని ఆహారంగా తీసుకుంటాయని వెల్లడించారు. వీటిని మనుషులు తినకూడదని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి