AP Rains: మరో అల్పపీడనం.. ఈ నెల 29 నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో..

శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడనుంది, దీని వల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఏపీలో అక్టోబర్ చివర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Rains: మరో అల్పపీడనం.. ఈ నెల 29 నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో..
Ap Rains

Updated on: Oct 25, 2022 | 4:56 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సిత్రాంగ్ స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21కిలోమీటర్ల వేగంతో కదులుతుంది..బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లగా, ఏపీలో ఉన్న తేమని లాగి బంగ్లాదేశ్, ఈశాన్య భారత దేశం ప్రాంతాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలో ప్రభావం చూపనుంది.

సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత​పెరుగుతోంది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పడుతున్నాయి. సిత్రాంగ్ తుపాను సోమవారం ఒడిశా తీరాన్ని చేరుకుంది.అలాగే ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌లోని టికోనా దీవి దగ్గర తీరం దాటే అవకాశముంది..అయితే ఈ సిత్రాంగ్‌ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం దాటే ముందు తీవ్రరూపం దాల్చొచ్చని భావిస్తున్నారు..సిత్రాంగ్‌ ప్రభావంతో బెంగాల్‌, అసోంతో పాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని, దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు..

దీంతో రెండు రోజుల పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడనుంది, దీని వల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఏపీలో అక్టోబర్ చివర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వర్షాలు తగ్గినా, మరోవైపు రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుండగా, తెలంగాణలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.

అయితే సిత్రాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే బెంగాల్‌‌లోని సుందర్‌బన్‌ తీరంలో ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి.తీరప్రాంతంలో NDRF‌ బృందాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.సౌత్‌ 24 పరగణ జిల్లాలో కూడా హైఅలర్ట్‌ కొనసాగుతోంది. బకాలి బీచ్‌ దగ్గర టూరిస్టులను దూరంగా పంపించారు. సివిల్‌ డిఫెన్స్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి. సహాయక చర్యల కోసం బెంగాల్‌తో పాటు అసోంలో ఇప్పటికే NDRF బృందాలు రంగంలోకి దిగాయి.