నివర్ తుఫాన్‌: తిరుపతిలో పూర్తిగా నీట మునిగిన కరకంబాడి మెయిన్‌ రోడ్డు.. రాకపోకలు నిలిపివేసిన పోలీసులు

| Edited By:

Nov 26, 2020 | 11:28 AM

నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

నివర్ తుఫాన్‌: తిరుపతిలో పూర్తిగా నీట మునిగిన కరకంబాడి మెయిన్‌ రోడ్డు.. రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
Follow us on

Tirupati rain news: నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక తిరుపతిలోనూ రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో మాడవీధులు నిండిపోయాయి. ఇక తిరుపతిలో కరకంబాడి మెయిన్‌ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. అలాగే రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి మీద నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కరకంబాడి మెయిన్‌ రోడ్డు మీద నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు పోలీసులు. సుభాష్ నగర్, ఎర్రమిట్ట, లీలామహర్ సెంటర్, కొర్లగుంటలో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో జనాలు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు.

Read More:

చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌ రేసులో తమిళ డైరెక్టర్‌.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 862 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 961 మంది