Rain Alert: అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

|

Oct 22, 2024 | 11:08 AM

Cyclone Dana Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. పారాదీప్‌కు 730కి.మీ, బెంగాల్ ఐలాండ్‌కు 770కి.మీ, బంగ్లాదేశ్ కేపు పారాకు 740కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం రేపటికి తుఫాన్‌గా బలపడనుంది.

Rain Alert: అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Rain Alert
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. పారాదీప్‌కు 730కి.మీ, బెంగాల్ ఐలాండ్‌కు 770కి.మీ, బంగ్లాదేశ్ కేపు పారాకు 740కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం రేపటికి తుఫాన్‌గా బలపడనుంది. తుఫాన్‌కు ‘దానా’గా నామకరణం చేయనుంది ఐఎండీ.. ఎల్లుండి ఒడిశా, బెంగాల్ తీరాల సమీపానికి తుఫాన్‌ చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.. తుఫాన్ నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. తీరం వైపు వెళ్లే కొద్దీ తుఫాన్ మరింత బలపడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 100-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. . అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అక్టోబరు 24 – 25న పూరీ – సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు. అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగినజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..