Andhra: హైవేపై వేగంగా దూసుకొస్తున్న కారు.. అంతలోనే పోలీసులమంటూ ఆపారు.. సీన్ కట్ చేస్తే.!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి గుంటూరు జిల్లా మేడికొండూరు వైపు ఓ కారు దూసుకొస్తుంది. ఈ క్రమంలోనే మేడికొండూరు సమీపంలో పోలీస్ దుస్తులు వేసుకుని కొందరు కారును ఆపారు. ఆపై జరిగిన సీన్ ఇది. ఆ వివరాలు ఇలా.. ఓసారి లుక్కేయండి.

Andhra: హైవేపై వేగంగా దూసుకొస్తున్న కారు.. అంతలోనే పోలీసులమంటూ ఆపారు.. సీన్ కట్ చేస్తే.!
Representative Image

Edited By:

Updated on: Aug 15, 2025 | 1:23 PM

మహారాష్ట్రకు చెందిన బంగారు వ్యాపారి జగదీష్, మరో ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి గుంటూరు జిల్లా మేడికొండూరు వైపు దూసుకొస్తుంది. ఈ క్రమంలోనే మేడికొండూరు సమీపంలో పోలీస్ దుస్తుల్లో ఉన్న కొంతమంది కారు ఆపారు. కారులో ఉన్న జగదీష్‌ను పేరు పెట్టి పిలిచి.. అతని వద్ద ఉన్న డెభ్బై లక్షల నగదు, రెండు కేజీల ముడి బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈడీ అధికారులమంటూ చెప్పారు. కారు సోదా చేయాలన్నారు. అదే సమయంలో జగదీష్‌పై చేతులతోనే దాడి చేసి బ్యాగ్ లాక్కొని పరారయ్యారు. డెభ్బై లక్షల రూపాయల నగదు పోవడంతో జగదీష్ వెంటనే మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు చిక్కుముడి విప్పారు. మొత్తం మహారాష్ట్రకు చెందిన పదకొండు మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అసలేం జరిగిందంటే..

మహారాష్ట్రకు చెందిన జగదీష్ కొన్నేళ్లుగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం గుంటుపల్లి వద్ద నివసిస్తూ బంగారు, వెండి నాణ్యత చెక్ చేసే దుకాణం ప్రారంభించాడు. జగదీష్‌కు మహారాష్ట్రకే చెందిన రంజిత్‌తో పరిచయం ఏర్పడింది. రంజిత్ రాజమండ్రిలో ఉంటూ బంగారు వ్యాపారం చేస్తున్నాడు. రంజిత్ తక్కువ ధరకే బంగారం వస్తుందంటూ జగదీష్‌తో చెప్పాడు. కేజీ 58 లక్షల రూపాయలకే బంగారం ఇప్పిస్తానని తెలిపాడు. దీంతో మొదట ఢెబ్బై లక్షలు చెల్లించేందుకు జగదీష్ సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే డెభ్బై లక్షల రూపాయల నగదు తీసుకొని రంజిత్‌తో కలిసి సత్తెనపల్లి నుండి గుంటూరు వస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది కారును ఆపి ఈడీ అధికారులమంటూ బెదిరించి నగదు తీసుకొని పారిపోయారు. అయితే జగదీష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు.

మహారాష్ట్రకే చెందిన ముఠా ఈ దోపిడి వెనుక దాగి ఉందని తేల్చారు. ముఠాలో ఏ1గా ఉన్న అనుకుష్ రామచంద్ర, ఏ3గా ఉన్న ధనాజీ సాలంకేలను అరెస్ట్ చేశారు. మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. బంగారం కొనుగోలు చేయడానికి డబ్బులతో వస్తున్నాడన్న ముందస్థు సమాచారంతోనే ఈడీ అధికారుల వేషం వేసి నగదు దోచుకున్నట్లు మేడికొండూరు సిఐ నాగూర్ బాషా, తుళ్లూరు డిఎస్పీ మురళి క్రిష్న తెలిపారు. త్వరలోనే అందరిని పట్టుకుంటామని చెప్పారు.

ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి