Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి తీవ్రంగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుగోల సామర్థ్యం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఉందని, ఆ దిశగా ప్రైవేటీరణను అడ్డుకోవడానికి వెంకయ్యనాయుడు బాధ్యత తీసుకోవాలని నారాయణ కోరారు. శుక్రవారం నాడు ఉదయం స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా దీక్షా శిభిరంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిగా విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమంలో పాల్గొన్న వెంకయ్య దీనిపై నోరు విప్పాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గిరి ని తిరస్కరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపితేనే మిజోరాం గవర్నర్ గా వెళ్తానని హరిబాబు పదవిని కండీషన్ పెడితే.. కేంద్రం దీనిపై పునరాలోచించే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటే తప్ప ఉత్తరాలతో ప్రయోజనమేమీ ఉండదన్నారు. స్టీల్ ప్లాంట్ లేని విశాఖ ని రాజధాని చేస్తే బోడి గుండుకు మల్లెపూలు చుట్టినట్టే ఉంటుందని తనదైన శైలిలో కామెంట్స్ చేశారు నారాయణ. స్టీల్ ప్లాంట్‌పై కోర్టుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ప్రజా పోరాటాలకు, ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ.. దేశానికి ప్రధానిగా కాకుండా అంబానీ, అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నారాయణ ఫైర్ అయ్యారు. యావత్ దేశ సంపదను అదానీకి, అంబానీలకు రాసిచ్చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
Also read:
K Annamalai: మాజీ ఐపీఎస్ అధికారికి తమిళనాడు బీజేపీ పగ్గాలు.. పార్టీలో చేరిన ఏడాదికే కీలక బాధ్యతలు