నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో బొనిగి. ఆనందయ్య కరోనా మందు తయారు చేసే కేంద్రాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన పూర్వకుల నుంచి అందించిన ప్రకృతి ఎంతో అద్భుతమైనదని, ప్రకృతి వైద్యం నుంచే అల్లోపతి వైద్యం తయారు అయ్యిందన్నారు. ఆనందయ్య వనమూలికలతతో తయారు చేస్తున్న మందు ఎలాంటి దుష్ప్రభావాలు చూపదని చెప్పారు. ఎందరో శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొనలేనిది ఒక రైతు కనుగొని ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాడని ప్రశంసించారు. ప్రభుత్వం వెంటనే తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కార్పోరేట్ వైద్యసంస్థలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. 70 వేల మంది కి వైద్యం చేస్తే ఒక్క వ్యక్తిని చూపించి ఆనందయ్య మందును తప్పు పట్టడం సబబు కాదని పేర్కొన్నారు. నిక్కచ్చగా నివేదికలు ఉండేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. త్వరితగతిన రీసెర్చ్ పూర్తి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.
ఆనందయ్యకు ప్రాణహాని ఉందని, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించి ఆనందయ్య మందుపై స్పష్టత కల్పించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నారాయణ కోరారు. వంట ఇంటి సరుకులతో వ్యాధిని నయం చేసే బోనిగి. ఆనందయ్య వైద్యం త్వరగా
అందుబాటులోకి రావాలని నారాయణ ఆకాంక్షించారు.
Also Read: ఓ రోగికి అత్యవసర మెడిసిన్ అందించేందకు రోడ్డుపైకి హీరో నిఖిల్.. అడ్డుకున్న పోలీసులు.. చివరకు