AP Corona Virus: దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ మొదలైంది. రోజు రోజుకీ కరోనా వైరస్(Corona Virus) బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా నమొదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యలు ప్రారభించారు. ఇక ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో కూడా భారీగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆంక్షలు దిశగా అడుగులు వేస్తోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కూడా కరోనా కలకలం సృష్టిస్తున్న నేపధ్యంలో అధికారులు చర్యలు మొదలు పెట్టారు.కోవిడ్ ఉధృతితో ఏపీలో ఆలయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్. దర్శనాలు, అన్నదానం వద్ద భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్ సేవలకు ప్రయారిటీ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
శ్రీశైలంతో పాటు కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఆలయాల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేసినట్లు జవహర్ లాల్ చెప్పారు. అన్నవరం, శ్రీశైలం సహా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే విధులకు అనుమతిస్తున్నామన్నారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బంది రక్షణకు ప్రత్యేక చర్యలు చేపదుతున్నామని దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ స్పష్టం చేశారు.
Tv9 Telugu , Reporter: MPRao
Also Read: సేంద్రియ సాగులో రైతులకు మహిళ సాయం… లక్షల్లో లాభాలు ఆర్జించేలా సహకారం