
COVID-19 Cases: ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. జూన్ 26 నుంచి12 కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కడప,గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొవిడ్ పాజిట్‌తో నలుగురు మృతి చెందారు. ఒకే ప్రాంతంలో క్లస్టర్‌గా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నలుగురు మృతి చెందగా, వారందరికీ ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలు పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రస్తుతం ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు పాటించాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యులు, ఆసుపత్రులను అప్రమత్తం చేశామని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయని, దేశంలో అత్యధికంగా కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.
అయితే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్-19 కేసులు బయటపడటంతో, కరోనావైరస్ తిరిగి రావడం, మళ్లీ లాక్‌డౌన్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి 2020 నాటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్తున్నామా అనే ఆందోళనను ప్రజలలో మళ్లీ టెన్షన్ పెట్టిస్తోంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, వైద్యుల, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.