Andhra Pradesh: మద్యం కోసం తండ్రిని చంపిన కసాయి కొడుకు.. జీవిత ఖైదు విధించిన కోర్టు

| Edited By: Srilakshmi C

Dec 12, 2023 | 6:02 PM

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మాధవ నగరం గ్రామం. 70 ఏళ్ల అప్పన్న.. తన కొడుకు సత్తిబాబు ఇతర కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన సత్తిబాబు.. డబ్బుల కోసం ఇంట్లో తరచూ గొడవలు పడేవాడు. ఆదాయం తీసుకొచ్చింది లేదు కానీ.. ఉన్నదంతా ఖర్చు పెట్టి మద్యం తాగేసేవాడు. గత ఏడాది ఫిబ్రవరి 10న.. ఇంటికి వచ్చి గొడవ పడిన సత్తిబాబు.. తండ్రి అప్పన్న తో వాగ్వాదానికి దిగాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవ ప్రారంభించాడు..

Andhra Pradesh: మద్యం కోసం తండ్రిని చంపిన కసాయి కొడుకు.. జీవిత ఖైదు విధించిన కోర్టు
Life Imprisonment
Follow us on

అనకాపల్లి, డిసెంబర్ 12: అది 2022 ఫిబ్రవరి పదో తేదీ. ఒక్కసారిగా ఆ గ్రామంలో కలవరం. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించే అప్పన్న విగతజీవిగా మారాడు. తల నుంచి రక్తం కారుతోంది. ఇంతకీ అప్పన్న పై దాడి చేసింది ఎవరోకాదు కన్న కొడుకే..! ఒక్కసారిగా అవాక్కైన కుటుంబ సభ్యులు, స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఏడదిన్నర తర్వాత న్యాయస్థానం ఆ కొడుకుకు తగిన శిక్షే వేసింది.

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మాధవ నగరం గ్రామం. 70 ఏళ్ల అప్పన్న.. తన కొడుకు సత్తిబాబు ఇతర కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన సత్తిబాబు.. డబ్బుల కోసం ఇంట్లో తరచూ గొడవలు పడేవాడు. ఆదాయం తీసుకొచ్చింది లేదు కానీ.. ఉన్నదంతా ఖర్చు పెట్టి మద్యం తాగేసేవాడు. గత ఏడాది ఫిబ్రవరి 10న.. ఇంటికి వచ్చి గొడవ పడిన సత్తిబాబు.. తండ్రి అప్పన్న తో వాగ్వాదానికి దిగాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవ ప్రారంభించాడు. అందుకు అప్పన్న నిరాకరించడంతో.. కోపంతో ఊగిపోయాడు సత్తిబాబు. అక్కడే ఉన్న కర్రతో తండ్రి అప్పన్న తలపై బలంగా కొట్టాడు. దీంతో అప్పన్న తీవ్ర గాయాలపాలై.. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రిని హత్య చేశాక సత్తిబాబు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సత్తిబాబును అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. కోర్టులో చార్జ్ చేయటం దాఖలు చేశారు పోలీసులు. సాక్షాధారాల ఆధారంగా విశాఖ రెండో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి కీలక తీర్పు ఇచ్చారు. తండ్రిని హత్య చేసిన కొడుకు గండ్రకోట సత్తిబాబుకు జీవిత ఖైదు విధించారు. ఎంతపాటు మరో ఐదు వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించారు. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ మురళీకృష్ణ ప్రకటనలో తెలిపారు. కేసును త్వరితగతిన విచారణ చేసి సాక్షదారులను కోట్లు సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.