AP Corona Virus: ఏపిలోని స్కూల్స్ పై కరోనా పంజా.. ఒకే స్కూల్ లో 147 మందికి కోవిడ్ పాజిటివ్‌

|

Jan 22, 2022 | 10:11 AM

AP Corona Virus: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్(Corona Virus) థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో భారీగా కోవిడ్ కొత్త కేసులు నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్(andhraspradesh) లో..

AP Corona Virus: ఏపిలోని స్కూల్స్ పై కరోనా పంజా.. ఒకే స్కూల్ లో 147 మందికి కోవిడ్ పాజిటివ్‌
Follow us on

AP Corona Virus: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్(Corona Virus) థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో భారీగా కోవిడ్ కొత్త కేసులు నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్(andhraspradesh) లో కూడా కరోనా వైరస్ ఓ రేంజ్ లో విజ్రుభిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని వివిధ స్కూల్స్ లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా భారీగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదయిన కేసుల్లో 10 శాతం కేసులు పాఠశాలల నుంచి కావడం గమనార్హం.

సంక్రాంతి సెలవుల అనంతరం గత ఐదు రోజులనుంచి జిల్లా వ్యాప్తంగా 54 మంది ఉపాద్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒకే స్కూల్ లో ఇప్పటి వరకూ మొత్తం 147 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరందరినీ ఐసోలేషన్ కు తరలించి తగిన చికిత్సనందిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజు రోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాద్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ కరోనా వైరస్‌ ఉధృతి తగ్గే వరకు పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే స్కూల్స్ కు సెలవు ఇవ్వడంపై ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కరోనా కేసులు నమోదైన పాఠశాలలో శానిటైజర్ చేయించి స్కూల్స్ నడుపుతామని ఏపీ సర్కార్‌ చెబుతోన్న సంగతి తెలిసిందే.

Also Read:

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆ ఫోన్లకు సరికొత్త ఫీచర్‌.. అదేంటంటే?