Corona Cases Andhra Pradesh: ఏపీ ప్రజలకు ఊరటను ఇచ్చే వార్త.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దిగువకు నమోదైంది. గడిచిన 24 గంటల్లో 83,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7,943 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే మహమ్మారి కారణంగా 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కు చేరింది.
ఇక ఆదివారం 19,845 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 15 లక్షల 28 వేల 360 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు- 765, ప్రకాశం- 345, నెల్లూరు- 378, చిత్తూరు- 1283, అనంతపురం- 544, శ్రీకాకుళం- 231, విజయనగరం- 271, విశాఖ- 551, తూర్పు గోదావరి- 1877, పశ్చిమగోదావరి- 461, కృష్ణా- 291, కర్నూలు- 499, కడప జిల్లా- 447 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 31/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,90,190 పాజిటివ్ కేసు లకు గాను
*15,25,465 మంది డిశ్చార్జ్ కాగా
*10,930 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,53,795#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Vx3s8rHUgS— ArogyaAndhra (@ArogyaAndhra) May 31, 2021