వంట నూనె ధరలపై వ్యాపారుల కుమ్మక్కు.. సిండికేట్ గా ఏర్పడి దోపిడీ.. టీవీ9 నిఘాలో సంచలన విషయాలు

|

Mar 04, 2022 | 5:12 PM

అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లు మారింది వ్యాపారుల తీరు. ఎక్కడో ఖండాంతరాల అవతల యుద్ధం(Russia - Ukraine War) జరుగుతుంటే.. ఇక్కడ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వంటనూనె(Cooking oil)కు మంటపెట్టి..

వంట నూనె ధరలపై వ్యాపారుల కుమ్మక్కు.. సిండికేట్ గా ఏర్పడి దోపిడీ.. టీవీ9 నిఘాలో సంచలన విషయాలు
Edible Oil Prices
Follow us on

అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లు మారింది వ్యాపారుల తీరు. ఎక్కడో ఖండాంతరాల అవతల యుద్ధం(Russia – Ukraine War) జరుగుతుంటే.. ఇక్కడ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వంటనూనె(Cooking oil)కు మంటపెట్టి కృత్రిమ కొరత(syndicate) సృష్టిస్తున్నారు. వ్యాపారులందరూ సిండికేట్‌గా ఏర్పడి ఆయిల్‌ సప్లై ఆగిపోయిందంటూ ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నారు. లీటర్‌ వంటనూనెపై రూ.40 నుంచి రూ.50 పెంచేశారు. అయితే ఒక్కసారిగా పెరిగిన ఆయిల్‌ ధరలకు అసలు కారణమేంటి? నిజంగానే ఉక్రెయిన్‌-రష్యా వార్‌తో ధరలు పెరిగాయా? లేక, యుద్ధాన్ని ఒక సాకుగా చూసుకుని ధరలు పెంచేస్తున్నారా.? వ్యాపారులు కృతిమ కొరత సృష్టించారా.? అనేది తెలుసుకునేందుకు టీవీ9 క్షేత్రస్థాయిలో పర్యటించింది. టీవీ9 నిఘా టీమ్‌ ఆపరేషన్‌లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. యుద్ధం వంకతో వ్యాపారులే దోపిడీకి తెరలేపినట్లు తేలింది. హోల్‌ సేలర్స్‌, రిటైలర్స్‌, షాపుల యజమానులంతా సిండికేట్‌ అయి, జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నట్లు గుర్తించింది. నెల్లూరులో వ్యాపారులు, కస్టమర్లతో మాట్లాడారు.

కొందరు వ్యాపారులు ఎమ్మార్పీ కి అమ్ముతుంటే, మరికొందరు ఎమ్మార్పీ పై అదనంగా రూ.40 – రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే, ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌ అంటూ సింపుల్‌గా చెప్పేస్తున్నారు. రాబోయే రోజుల్లో లీటర్ వంటనూనె రెండు వందలు దాటేస్తుంది. మీకు ఇష్టముంటే కొనండి లేదంటే వెళ్లిపోండి అని వ్యాపారులు చెప్పడం గమనార్హం. అసలు వంటనూనెకు…యుద్ధానికి సంబంధం ఏముందని అడిగితే కంపెనీలు తమకు అలాగే చెబుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. టీవీ9 క్షేత్ర స్థాయి దర్యాప్తుపై నెల్లూరులో తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు.

ప్రొవిజన్ షాపులు, సూపర్ మార్కెట్లలో సోదాలు చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. యుద్ధం పేరుతో కృత్రిమ కొరత, ధరల పెంపు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Also Read

Bihar Blast: ఇంట్లో భారీ పేలుడు.. పది మంది మృతి.. ఘటనకు అదే కారణమని అనుమానాలు

Pragya Jaiswal: మహా శివరాత్రి పర్వదినాన కోయంబత్తూర్ లోని ధ్యాన లింగాన్ని దర్శించుకున్న ప్రగ్యా జైస్వాల్

Viral Video: ద్యావుడా.. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాల్సిందే.. పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్..