Andhra Pradesh: జాతీయ రహదారిగా సబ్బవరం- తుని రోడ్.. ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్

|

Nov 02, 2022 | 12:32 PM

సబ్బవరం- తుని రహదారి దశ తిరగబోతుందా..? త్వరలో నేషనల్ హైవే అవ్వబోతుందా..? సంకేతాలు అలానే ఉన్నాయి.

Andhra Pradesh: జాతీయ రహదారిగా సబ్బవరం- తుని రోడ్.. ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్
Sabbavaram Tuni Road
Follow us on

కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కలిశారు. సబ్బవరం- తుని రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని వినతిపత్రం ఇచ్చారు. 133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి 2200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు.  ఈ రహదారి పనులు వేగంగా చేయాలని గడ్కరీని కలిసి విన్నవించారు ధర్మశ్రీ.  ఈ రహదారితో ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డిపిఆర్ కూడా ఇప్పటికే పూర్తైనట్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని ధర్మ శ్రీ తెలిపారు.

మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా గట్టిగా గళం వినిపిస్తున్నారు ధర్మశ్రీ. ఇప్పటికే ఆయన స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు. దీనిపై స్పీకర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. విశాఖను పరిపాలనా రాజధానిగా అమరావతి రైతులు వ్యతిరేకిస్తే..  తాము ముమ్మాటికీ అమరావతికి  వ్యతిరేకమేనని ధర్మశ్రీ చెబుతున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అచ్చెన్నపై పోటీకి తాను రెడీ అని పేర్కొన్నారు.

బీఈడీ బీఎల్‌ చదవిన ధర్మశ్రీ యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొందారు. చోడవరం నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చోడవరం ఎమ్మెల్యేగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. విస్తరణ సమయంలో మంత్రి పోస్ట్ ఆశించి భంగపడ్డారు. ఆ బాధతో బహిరంగంగానే కంటతడి పెట్టుకున్నారు. ఇటీవల ఆయనకు కీలకమైన ప్రభుత్వ విప్‌ పదవికి కట్టబెట్టింది ప్రభుత్వం.

మరిన్ని ఏపీ వార్తల కోసం..