Watch Video: దేవుడిలా వచ్చాడు.. నీటిలో కొట్టుకుపోతున్న యువకుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. వీడియో

|

Nov 28, 2021 | 7:02 AM

Constable saved 4 lives: ఆ యువకులు ఇక ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇవే ఆఖరి క్షణాలు అనుకున్నారు.. ఎందుకో ఏమో ఆ దేవుడే స్వయంగా

Watch Video: దేవుడిలా వచ్చాడు.. నీటిలో కొట్టుకుపోతున్న యువకుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. వీడియో
Mans Fall In Water
Follow us on

Constable saved 4 lives: ఆ యువకులు ఇక ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇవే ఆఖరి క్షణాలు అనుకున్నారు.. ఎందుకో ఏమో ఆ దేవుడే స్వయంగా భూవిపైకి వచ్చాడు అన్నట్టుగా.. నీటిలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడాడు. రోడ్డున పోతున్నారు కదా మనకేంటి అనుకోలేదు. పక్కవాడు ఆపదలో ఉన్నాడు.. నేనేందుకు సాయం చేయాలి అని ఆలోచించలేదు.. నీటిలో కొట్టుకుపోతున్న వారి చూసి.. వెంటనే స్పందించిన స్పందించిన యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కటి కాదు.. రెండు కాదు.. నాలుగు ప్రాణాలు కాపాడాడు. ధైర్యం ముందడుగు వేసి నలుగురికి మరో జన్మనిచ్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది. ఓ బైక్‌పై నలుగురు యువకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ కుడి కాలువలో నలుగురు యువకులు పడ్డారు. ప్రమాదవశాత్తు బైక్‌ స్కిడ్‌ కావడంతో పక్కనే ఉన్న కాలువలో పడ్డారు. అయితే.. కాలువలో నీటిప్రవాహం అధికంగా ఉంది.

పడిన యువకుల్లో ఒకరికి ఈత రాదు. అంతే.. అతనితో వచ్చిన ముగ్గురు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి ప్రాణాలతో బయట పడడం కష్టమనుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఇద్దరు నీటిలో కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో నీళ్లలో మునిగిన పోతున్న ఇద్దరు వ్యక్తులను ఆ దారి వెంట వెళ్తున్న దుర్గి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసే ప్రవీణ్‌ కుమార్‌ చూశాడు. అనంతరం స్థానికుల సహాయంతో ఇద్దరిని కాపాడాడు. కాగా.. నీటిలో పడిన వారంతా క్షేమంగా బయటపడటంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలతో బయటకు రాలేరన్న యువకులను కానిస్టేబుల్ మళ్లీ ప్రాణాలు పోశాడు.

వెంటనే కానిస్టేబుల్‌ ప్రవీణ కుమార్‌ స్థానిక ఎస్ఐకి సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే పోలీసు వాహనాన్ని పంపించగా.. యువకులను పోలీస్ స్టేషన్ తరలించి ప్రధమ చికిత్స అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు. కాగా.. నీటిలో గల్లంతైన యువకులు లక్ష్మయ్య(25) రెంటచింతల, మక్కెన బాబు(25) గుంటూరు, వెంకటేశ్వర్లు(20) గుంటూరు చెన్నకేశవులు (33) గా గుర్తించారు. కనిగిరి చెందిన ఈ నలుగురు యువకులు అడి గొప్పల వద్ద గల నీలంపాటి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఓ వివాహనికి హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. ఈ విషయం తెలిసుకున్న పోలీసు ఉన్నతాధికారులు, స్థానికులు కానిస్టేబుల్‌ ధైర్యాన్ని, మానవీయ కోణాన్ని కొనియాడుతున్నారు.

వీడియో..

Also Read:

MLA Roja: కోనసీమలో సందడి చేసిన ఎమ్మెల్యే, సినీనటి రోజా.. పంటు పడవపై ప్రయాణిస్తూ..

Weight Loss Tips: ఈ శీతాకాలంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ఈ 5 లేజీ ట్రిక్స్‌తో సులువుగా బరువు తగ్గొచ్చు..!