Congress: ఏపీలో బీజేపీ లేదు కాబట్టే ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. సచిన్ పైలెట్ సంచలన వ్యాఖ్యలు

| Edited By: Balaraju Goud

Mar 02, 2024 | 12:32 PM

తిరుపతిలో కాంగ్రెస్ న్యాయసాధన సభ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎజెండాగానే సాగింది. పోరాడుదాం సాధిద్దాం నిర్మిద్దాం నినాదంతో తిరుపతి తారకరామా స్టేడియం వేదికగా సభ నడిచింది. ఏఐసిసి జనరల్ సెక్రెటరీ సచిన్ పైలెట్, ఏపీసీసీ చీఫ్ షర్మిల, మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Congress: ఏపీలో బీజేపీ లేదు కాబట్టే ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. సచిన్ పైలెట్ సంచలన వ్యాఖ్యలు
Sachin Pilot Ys Sharmila
Follow us on

తిరుపతిలో కాంగ్రెస్ న్యాయసాధన సభ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎజెండాగానే సాగింది. పోరాడుదాం సాధిద్దాం నిర్మిద్దాం నినాదంతో తిరుపతి తారకరామా స్టేడియం వేదికగా సభ నడిచింది. ఏఐసిసి జనరల్ సెక్రెటరీ సచిన్ పైలెట్, ఏపీసీసీ చీఫ్ షర్మిల, మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ హలో సచిన్ పైలట్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. తండ్రి రాజేష్ పైలట్ కు ఆంధ్రప్రదేశ్ తో ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్న సచిన్ పైలెట్.. లోక్‌సభ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ప్రధానమైనవన్నారు.10 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ బీజేపీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రణాళిక సంఘం, మంత్రిమండలి ఆమోదించిన ప్రత్యేకహోదాను బీజేపీ అమలు చేయలేదన్నారు సచిన్ పైలెట్ ధ్వజమెత్తారు. 10 ఏళ్లుగా కేంద్రంలో పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలో ఉన్న ప్రత్యేక హోదా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టే బీజేపీ మోదీ హోదాపై అమలు చేయటం లేదన్నారు సచిన్ ఫైలట్. 10 ఏళ్లలో మోదీ దేశంలో సంక్షేమం, అభివద్ది పట్టించుకోలేదని రైతులు, పేదలకు ఎలాంటి సంక్షేమం అమలు చేయలేదన్నారు. బీజేపీ అమలు చేయని ప్లత్యేకహోదాను కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక మొదటి నిర్ణయంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు సచిన్ పైలెట్. రాష్ట్ర వాటాల కోసం కేంద్రంపై డిల్లీలో పోరాటాలు చేయాల్సి వస్తోందని కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు పోరాటాలు చేశారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయలేదన్న సచిన్ పైలెట్.. ప్రత్యేక హోదా కోసం కొత్త పీసీసీ నాయకత్వంలో రాష్ట్రంలో బలంగా పోరాటం చేస్తుందన్నారు. ప్రత్యేకహోదా రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు సచిన్ పైలెట్.

ఇక కాంగ్రెస్ న్యాయసాధన సభలో షర్మిల కూడా ప్రత్యేక హోదా అంశాన్నే టార్గెట్ చేశారు. తిరుపతిలో తారకరా రామ క్రీడా మైదానంలో ప్రధాని మోదీ 2014 లో ప్రత్యేకహోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఓట్ల కోసం ప్రత్యేకహోదా వాగ్దానం చేశారని రాష్ట్ర రూపపరేఖలు మారుస్తానని హామీ ఇచ్చారన్నారు షర్మిల. ఢిల్లీ ని మించిన నగరం రాజధాని నగరం నిర్మిస్తామని చెప్పారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఎన్నో పొందుపరిచారని రాష్ట్ర ప్రజల హక్కులో ఏ ఒక్కటైనా 10 ఏళ్లలో సాదించారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు షర్మిల. పాలకపక్షం, ప్రతిపక్షం రెండు బీజేపీ దాసోహమయ్యాయని మూడు నామాల వాడి సాక్షిగా ఇచ్చిన హామీలకు పంగనామాలు పెట్టారని ఏద్దేవా చేశారు.

రాష్ట్రానికి మూడు రాజథానులు కావాలన్న జగనన్న మూడు కాదు ఒకటైనా నిర్మించాడా అని నిలదీశారు. విభజన సమయంలో తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోదీ ఇప్పుడేమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా పదేళ్లుగా తల్లి ఆంద్రను మోదీ చంపుతూనే ఉన్నాడన్నారు. 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా సంజీవనిఅని ఏమి చేశారన్నారు షర్మిల. ప్రత్యేకహోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్న జగన్ ఏమయ్యాడని ప్రశ్నించారు. మూకుమ్మడి కాదు ఒకరు కూడా రాజీనామా చేయలేదన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక ఎంపీ అయినా మాట్లాడారా అని నిలదీసే ప్రయత్నం చేశారు షర్మిల. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్లు ప్రత్యేకహోదా అమలు చేస్తామన్నారు షర్మిల.

ఇక సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా తిరుపతి వేదికగా ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన మోదీని టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టారన్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోదీ మట్టి నీళ్లు మొహాన కొట్టారన్నారు. తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి మోదీనే నని ద్రోహం చేసిన మోదీ పాదాలు జగన్ నొక్కుతున్నారని ఆరోపించారు. మోదీతో చంద్రబాబు చేతులు కలుపుతున్నారని సైకిల్, ఫ్యాన్ రెండింటిని ఊరు బయటపెట్టాలన్నారు. దేవున్ని మోసం చేసిన మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…