Cold Waves in Manyam Area: విశాఖ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. పంజా విరిసిన చలి.. వణుకుతున్న మన్యం వాసులు

|

Feb 05, 2021 | 8:42 AM

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగత్రలు అతితక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి తీవ్రత పెరిగింది. దీనికి కారణం ఉత్తర ఈశాన్యం నుంచి..

Cold Waves in Manyam Area: విశాఖ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. పంజా విరిసిన చలి.. వణుకుతున్న మన్యం వాసులు
Follow us on

Cold Waves in Manyam Area: తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగత్రలు అతితక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి తీవ్రత పెరిగింది. దీనికి కారణం ఉత్తర ఈశాన్యం నుంచి వీస్తున్న చల్లనీ గాలుల ప్రభావం అని వాతావరణం నిపుణులు చెప్పారు. మరోవారం రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగనున్నదని అన్నారు.

ముఖ్యంగా మన్యం ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లి 6.3,మినుములూరు 8, అరకు,పాడేరు 9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటల వరకూ పొగమంచు ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పగటి వేళల్లో సైతం చలి గాలులు వీస్తున్నాయి. దీంతో మన్యం వాసులు వణుకుతున్నారు. ఫిబ్రవరి నెలలో ఇంతటి చలిని గతంలో ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. గత నెల చివరి వరకు తగ్గుతూ వచ్చిన చలి ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా పెరిగింది.

Also Read:

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో గజగజ వణికిపోతున్నారు గిరిజనం

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. మళ్లీ ఉద్యమం. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్‌ చేయాలన్న నిర్ణయంతో రోడ్డెక్కుతోన్న పార్టీలు, సంఘాలు