తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో గజగజ వణికిపోతున్నారు గిరిజనం
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో గజగజ వణికిపోతున్నారు గిరిజనులు. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం పూట ఇంటి నుంచి బయటకి రావాలంటేనే జనం వణికిపోతున్నారు.
ఇటు తెలంగాణలోనూ చలి తీవ్రత పెరిగిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో ఏజెన్సీ గూడేల్లో ఉన్న గిరిజనులు గజగజ వణికిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొమురంభీం ఆసిఫాబాద్ , ఆదిలాబాద్ , మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత 7 డిగ్రీలకు చేరింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి ( టి )లో అత్యల్పంగా 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కొమురంభీం జిల్లా వాంకిడిలో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా సొనాల లో 7.8 , సిర్పూర్‌లో 7.9 , బేలాలో 8.1 , కవ్వాల్ లో 8.3 , కెరమెరిలో 8.5, జన్నారం 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ చలి వణికిస్తోంది. కామారెడ్డి జిల్లా పిట్లంలో 8.5, సంగారెడ్డి జిల్లా కోహీరులో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల ముందుకు వరకు 12, 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడు 7 డిగ్రీల దిగువకు పడిపోవడంతో జనం వణికిపోతున్నారు. ఒక్కసారిగా 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం భయటకి రావాలంటేనే జంకుతున్నారు. వాకర్స్ సైతం ఉదయం నడకకు దూరమవుతున్నారు. ఈ చలి తీవ్రత మరి కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అటు చలి తీవ్రతతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై కసరత్తు, ఆర్థికలోటును పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ