Andhra Pradesh: మంచు ముసుగులో మన్యం.. టూరిస్టుల సందడి..

సంక్రాంతి సెలవులతో అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్లో భారీగా సందర్శకుల తాకిడి పెరిగింది. మాడగడ, వంజంగి మేఘాల కొండ లకు సందర్శకులు చేరుకొని సందడి చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు. సూర్యోదయాన్ని లేలేత కిరణాలను ఆస్వాదిస్తూ మంచు మేఘాల మధ్య నుంచి ఉదయిస్తున్న భానుడిని కెమెరాల్లో బంధిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Andhra Pradesh: మంచు ముసుగులో మన్యం.. టూరిస్టుల సందడి..
Andhra Pradesh

Edited By:

Updated on: Jan 17, 2024 | 1:36 PM

పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. దట్టంగా పొగ మంచు కురుస్తోంది. అరకు, పాడేరు 13 డిగ్రీలు, చింతపల్లిలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంక్రాంతి సెలవులతో అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్లో భారీగా సందర్శకుల తాకిడి పెరిగింది. మాడగడ, వంజంగి మేఘాల కొండ లకు సందర్శకులు చేరుకొని సందడి చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు. సూర్యోదయాన్ని లేలేత కిరణాలను ఆస్వాదిస్తూ మంచు మేఘాల మధ్య నుంచి ఉదయిస్తున్న భానుడిని కెమెరాల్లో బంధిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జి మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి టూరిస్టులు క్యూ కట్టారు.