Cold booming in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న చలి.. తీవ్రంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Cold booming in Telugu states: వాతావరణ మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. మంచువల్ల వాహనదారులు చాలా

Cold booming in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న చలి.. తీవ్రంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Edited By:

Updated on: Dec 31, 2020 | 9:40 AM

Cold booming in Telugu states: వాతావరణ మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. మంచువల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు వెళుతున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇక నిత్యవసరాలందించే వ్యాపారులు, కూరగాయల విక్రయదారులు, హోటల్ కార్మికులు తదితర వర్గాలు రోజువారి పనులను ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు.

వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి.ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మినుములూరులో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 7.8, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీమ్‌లో 10 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 10.6, సంగారెడ్డిలో 11, నిర్మల్ 11.8 రంగారెడ్డిలో 11.9, జయశంకర్, మంచిర్యాల12.1, జగిత్యాల, ములుగులో 12.4, వికారాబాద్‌లో12.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.