Viral Video: నాగు పామును అమాంతంగా మింగేసిన మరో భారీ నాగుపాము…షాకింగ్ వీడియో వైరల్

| Edited By: Jyothi Gadda

Sep 30, 2024 | 1:52 PM

ఘటనా స్థలానికి చేరుకుని భారీ నాగుపామును ఒడుపుగా పట్టుకుని బంధించారు. ఎట్టకేలకు నాగు పామును పట్టుకోవటoతో అప్పటి వరకు భయాందోళనలకు గురయిన స్థానికులంతా హమ్మయ ఆంటూ ఊపిరి పీల్చుకున్నాను. అనంతరం బంధించిన నాగు పామును కోసంగిపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు స్నేక్ క్యాచర్.

Viral Video: నాగు పామును అమాంతంగా మింగేసిన మరో భారీ నాగుపాము...షాకింగ్ వీడియో వైరల్
Cobra
Follow us on

సాధారణంగా పాముకు ఆకలి వేస్తే కోడి పిల్లలను,గుడ్లను,కప్పలను, ఎలుకలను మింగేయటం చూసే ఉంటాం. కానీ ఓ భారీ నాగు పాముకి ఎంత ఆకలి వేసిందో ఏమోగానీ తోటి భారీ నాగు పామును గుటకలేస్తూ కసిగా మింగేసింది. అది కూడా జనావాసాల మద్య అందరూ చూస్తుండగానే అమాంతంగా మింగేసిoది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో చోటుచేసుకుంది. రైల్వే కాలనీలోనీ ఎస్సీ, ఎస్టీ శ్రామిక యూనియన్ కార్యాలయం గేటు దగ్గర రెండు నాగు పాముల మధ్య భీకరమైన పోరు జరిగింది.దానిని స్థానికంగా ఉన్న రైల్వే పారిశుధ్య కార్మికులు, స్థానికులు గమనిoచారు. అలా దగ్గరగా చూస్తూ వుండగానే ఒక పామును మరో
భారీ నాగుపాము నోట కరిచి మింగేస్తోంది.

సుమారు ఐదు అడుగుల గోధుమ నాగు రెండు అడుగులున్న మరో నాగు పామును మింగేస్తు కనిపించటం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆ దృశ్యాన్ని చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచింది. అందరూ గుమికూడి చూస్తున్నా ఆ చప్పుడుకి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు పెద్ద పాము. పెద్ద పాము నోటి లోంచి బయట పడేందుకు చిన్న పాము తీవ్రంగానే ప్రతిఘటించే ప్రయత్నం చేసినా అది ఏమాత్రం ఫలించలేదు. చివరకు చిన్న పాము పెద్ద పాము కడుపులోకి నెమ్మదిగా జారిపోయింది.

సర్పాల మధ్య ఆహార అన్వేషణలో భాగంగా జరిగిన జీవన పోరాటంలో చిన్న పాము పెద్ద పాముకు ఆహారమైంది. అయితే చిన్న పామును మింగేసాక కూడా భారీ నాగు పాము అక్కడే‌‌ తిష్ట వేయడంతో అటవీ శాఖాధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు.కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ ఏ .మురళీ కృష్ణ నాయుడు ఆదేశాల మేరకు ఈస్టర్న్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ కి చెందిన స్నెక్ క్యాచ్చర్ ఓంకార్ త్యాడి రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని భారీ నాగుపామును ఒడుపుగా పట్టుకుని బంధించారు. ఎట్టకేలకు నాగు పామును పట్టుకోవటoతో అప్పటి వరకు భయాందోళనలకు గురయిన స్థానికులంతా హమ్మయ ఆంటూ ఊపిరి పీల్చుకున్నాను. అనంతరం బంధించిన నాగు పామును కోసంగిపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు స్నేక్ క్యాచర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..