Konaseema: ఇంట్లో నిద్రిస్తుండగా బీరువా వద్ద నుంచి వింత శబ్దాలు.. ఏంటా వెళ్లి చూడగా..

|

Aug 01, 2024 | 1:06 PM

పాశర్లపూడిలంకలో ఓ ఇంట్లోని వారు అంతా నిద్ర పోతుండగా రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోని బీరువా వద్ద నుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. ఆ ఇంటి యజమాని పరిక్షించి చూడగా...

Konaseema: ఇంట్లో నిద్రిస్తుండగా బీరువా వద్ద నుంచి వింత శబ్దాలు.. ఏంటా వెళ్లి చూడగా..
Snake Inside Home
Follow us on

తెలుగు రాష్రాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తోటలు, అటవీ ప్రాంతాలు అన్నీ జలమయం కావడంతో విషసర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తలదాచుకునేందుకు ఇళ్లలో చేరి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సందర్భంలో అనేకమంది పాముకాట్లకు గురవుతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో విష సర్పాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గడచిన నాలుగు రోజుల్లో పదుల సంఖ్యలో పాముకాటు గురయ్యారు.

ఒకవైపు వరద ముంపు, మరోవైపు విష సర్పాలు ఇళ్లలోకి చొరబడటంతో హడలెత్తిపోతున్నారు తీర ప్రాంత వాసులు. పాశర్లపూడిలంకలో ఓ ఇంట్లోని వారు అంతా నిద్రపోతుండగా రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోనుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. ఆ ఇంటి యజమాని లైట్ వేసి పరీక్షగా చూడగా ఇంట్లోని బీరువా పక్కన త్రాచు పాము బుసలు కొడుతూ కనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కుటుంబ సభ్యులు. ఆ రాత్రి సమయంలో ఏమి చేయాలో వారికి దిక్కు తోచలేదు. చివరికి ఆ ఇంటి యజమాని సాహసం చేయక తప్పలేదు. కర్ర సహకారంతో ఆ పామును స్టీల్ బిందెలోకి వెళ్లేలా చేసి, బిందెలోకి వెళ్లిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్లి నిర్మానుష ప్రదేశంలో వదిలి వేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా శివకోటిలో నలుగురు, అప్పనరామునిలంకలో ఇద్దరు, వివి మెరకలో ఒకరు, పెదపట్నం గ్రామంలో ఇద్దరు, పొన్నమండలో ఒకరు పాము కాటుకు గురై రాజోలు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే ముగ్గురు పాము కాటుకు గురై ఆసుపత్రుల్లో చేరారు. దీంతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు వదర బాధితులు. విష సర్పాలు వరద ఉధృతికి కొట్టుకొస్తూ జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయని విష సర్పాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరినైనా పాము కాటు గురైతే… కరచినిచోట గాట్లు పెట్టడం గాని.. మంత్రాలు వేయించుకోవడం వంటివి చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు గురికాగానే ఆలస్యం చేయకుండా దగ్గర్లో ఉన్న హెల్త్ సెంటర్ కు వెళ్లాలని డాక్టర్లు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..