CM Jagan: అక్టోబర్ 24 నుంచి జగన్ విశాఖలోనే.. రుషికొండలో సీఎం క్యాంపాఫీసు సిద్ధం..

|

Oct 04, 2023 | 8:14 PM

CM Jagan Vizag Updates: సీఎం కార్యాలయానికి తాత్కాలిక భవనాలు. ఈ మేరకు నిర్ణయం జరిగిపోవడంతో.. ఆ దిశగా శరవేగంగా కదులుతోంది టూరిజం శాఖ. రుషికొండపై విద్యుత్ సబ్ స్టేషన్‌... కొన్నాళ్లుగా తీరని సమస్యగా మారింది. సముద్రతీర ప్రాంతం కావడంతో ఇక్కడ నిబంధనలు అడ్డొచ్చాయి. శాశ్వత ప్రాతిపదికన సబ్ స్టేషన్ ఏర్పాటుకు వీల్లేదని తేల్చేయడంతో... ప్రత్యామ్నాయం కోసం చూశారు. కంటెయినర్ మోడల్లో భూగర్భ కేబుల్‌తో అనుసంధానం చేస్తున్నారు అధికారులు. రెండు నెలల కిందటే 7 కోట్లరూపాయలతో

CM Jagan: అక్టోబర్ 24 నుంచి జగన్ విశాఖలోనే.. రుషికొండలో సీఎం క్యాంపాఫీసు సిద్ధం..
CM Jagan new building in vishaka
Follow us on

ఈ నెల 23నే ముఖ్యమంత్రి జగన్ ఛలో విశాఖ.. 24న కొత్త ఇంట్లోకి ఎంట్రీ, అక్కడే సీఎం దసరా వేడుకలు… ఇంతవరకైతే పక్కా. మరి.. విశాఖలో ఆ కొత్త ఇల్లు నిర్మాణానికి సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఏంటి.. దానికి కొత్తగా వస్తున్న ఇబ్బందులేంటి.. వాటిని పరిష్కరించుకుంటూ బిల్డర్లు ఎలా ముందుకెళ్తున్నారు..? టోటల్‌గా సీఎం గృహప్రవేశానికి సంబంధించి అటు జనంలో ఆసక్తి, ఇటు అధికారుల్లో హైరానా… గట్టిగానే కనిపిస్తోంది.

రుషికొండపై సిద్ధమవుతున్న పర్యాటకశాఖ రిసార్టులే సీఎం కార్యాలయానికి తాత్కాలిక భవనాలు. ఈ మేరకు నిర్ణయం జరిగిపోవడంతో.. ఆ దిశగా శరవేగంగా కదులుతోంది టూరిజం శాఖ. రుషికొండపై విద్యుత్ సబ్ స్టేషన్‌… కొన్నాళ్లుగా తీరని సమస్యగా మారింది. సముద్రతీర ప్రాంతం కావడంతో ఇక్కడ నిబంధనలు అడ్డొచ్చాయి. శాశ్వత ప్రాతిపదికన సబ్ స్టేషన్ ఏర్పాటుకు వీల్లేదని తేల్చేయడంతో… ప్రత్యామ్నాయం కోసం చూశారు. కంటెయినర్ మోడల్లో భూగర్భ కేబుల్‌తో అనుసంధానం చేస్తున్నారు అధికారులు. రెండు నెలల కిందటే 7 కోట్లరూపాయలతో కంటెయినర్ విద్యుత్ సబేషన్ ఏర్పాటు పనులు ప్రారంభమైనా… అవి ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నాయి.

అటు… ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ EPDCL సొంతగా 14 కోట్ల రూపాయలతో 10 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. దాన్ని కంటైనర్ సబ్ స్టేషన్‌ కి అనుసంధానం చేస్తోంది.

రుషికొండపై ప్రస్తుతం రెండు భవనాలు పూర్తయ్యాయి. వాటిలో 19 కోట్లతో ఇంటీరియర్ పనులు మొదలయ్యాయి. ఫర్నిచర్ కొనుగోలు పూర్తి చేసి ఇన్‌స్టలేషన్ జరుగుతోంది. బీచ్ రోడ్ నుంచి రుషికొండ చివరి వరకు 40 అడుగుల రోడ్డు పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. రుషికొండ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, గ్రీనరీ కోసం 12 కోట్లతో టెండర్లు ఖరారు చేసి… పనులు ప్రారంభించింది పర్యాటకశాఖ.

రుషికొండ సమీపంలో ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతోంది. ఇప్పటివరకు PM పాలెం, ఆరిలోవ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఈ ప్రాంతం… ముఖ్యమంత్రి భద్రత నేపథ్యంలో రుషికొండ పోలీస్ స్టేషన్‌ ఏరియాగా మారబోతోంది. ఇటీవలే CMO సెక్యూరిటీ టీమ్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించింది.

సాధారణ పౌరులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రాకపోకలు ఉండేలా ఏర్పాట్లు జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎంట్రీ, ఎగ్జిట్, ప్రత్యామ్నాయ మార్గాలపై ఒక నివేదికను సిద్ధం చేసి, ట్రయల్ రన్ కూడా వేశారు.

టూరిజం కార్పొరేషన్ MD కన్నబాబు, CMO అదనపు కార్యదర్శి భరత్ గుప్తా… ఈ నిర్మాణాల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దసరా రోజులు వచ్చేస్తున్నాయి.. మిగింది మూడు వారాలే కనుక.. ఆ దిశగా పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. సో.. విజయదశమికి సీఎం నివాసం సిద్ధమవడం పక్కా అన్నమాట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..