AP CM Jagan: వరద ముంపు ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే.. తాజా పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా

|

Nov 20, 2021 | 7:18 AM

AP CM Jagan Aerial Survey:  గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమయ్యిన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఏరియల్ సర్వే...

AP CM Jagan: వరద ముంపు ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే.. తాజా పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా
Cm Jagan Areal Servey
Follow us on

AP CM Jagan Aerial Survey:  గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమయ్యిన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.  వరద ఉధృతి తాజా పరిస్థితిపై ఈరోజు ఉదయం తాడేపల్లిలో సీఎం జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించనున్నారు. వరదబాధిత జిల్లాల తాజాగా పరిస్థితిపై సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ్నించి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వే ముగిసిన అనంతరం రేణిగుంట చేరుకుని.. తిరిగి విజయవాడ గన్నవరం చేరుకుంటారు.

అయితే ఇప్పటికే ఏపీ వరద పరిస్థితిపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రధాని సీఎం జగన్ తో ఫోన్ లో మాట్లాడారు.  వరద పరిస్థితిపై అరా తీశారు. ప్రధానికి జగన్ తాజాగా పరిస్థితిని.. తీసుకుంటున్న చర్యలను వివరించారు. కేంద్రం అన్ని విధాలా సాయం అందింస్తుందని ప్రధాని మోడీ హామీనిచ్చారు.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు గ్రామాలూ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పశువులు, కోళ్లు వరదతాకిడికి కొట్టుకుని పోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పశువులు, కోళ్లు కొట్టుకుపోయాయి. జాతీయరహదారులపై వరద నీరు ప్రవహించింది. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.

Also Read:  వర్షాలు, వరదలతో కడప జిల్లా అతలాకుతలం.. 30మంది గల్లంతు.. 12 మృతదేహాలు లభ్యం.. నేడు కొనసాగనున్న గాలింపు