ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) విదేశీ పర్యటన ఖరారైంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ పర్యటన కోసం రేపు (మంగళవారం) రాత్రి 7.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న జగన్ పారిస్‌లో వచ్చే నెల 2వ తేదీ వరకు పర్యటించనున్నారు. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు. ఆ తర్వాత జులై 3న ఆయన తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ ఇటీవలే పిటిషన్ దాఖలు చేయగా… నాంపల్లిలోని సీబీఐ కోర్టు అందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.