CM Jagan Warning: ఆంధ్రప్రదేశ్‌లో దేవుళ్ల విగ్రహాల కూల్చివేత పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించారు. విగ్రహాలను ధ్వంసం చేసింది ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. కొందరు వ్యక్తులు తమ రాజకీయ స్వార్థం కోసం దేవుళ్లను వాడుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. ఆ క్రమంలోనే దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు.
దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన వారే మళ్లీ రచ్చ చేస్తున్నారంటూ విపక్షాలను ఉద్దేశించి సీఎం జగన్ ఫైర్ అయ్యారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడింది ఎవరైనా సరే వదిలేదని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు. కొందరికి దేవుడు అంటే భయం, భక్తీ లేదని పరోక్షంగా విపక్ష పార్టీల నేతలపై సీఎం విమర్శలు గుప్పించారు. ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలోనూ అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలు సరికాదని, ఎవరు తప్పు చేసినా ఊపేక్షించబోనని సీఎం జగన్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
Also read:
నాకెన్ని ఓట్లు పడ్డాయో చూసి చెప్పు, లేకపోతే, జార్జియా అధికారికి ట్రంప్ హుకుం, గంటసేపు ‘వేధింపులు’