CM Jagan: సడన్‌గా రైతు బాంధవులయ్యారు.. చంద్రబాబు,పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్‌ సెటర్లు..

చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఇప్పుడు ఆయనతోపాటు పవన్ పొలిటికల్ బాంధవుల అవతారం ఎత్తారని విమర్శించారు ముఖ్యమంత్రి జనగ్మోహన్ రెడ్డి. తనకు ఓటు వెయ్యకపోయినా ఫర్వాలేదు.. సంక్షేమమే ముఖ్యమనే లక్ష్యంతో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు జగన్. పంటనష్టాల పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు, పవన్‌ని ఉద్దేశించి జగన్ ఏమన్నారంటే..

CM Jagan: సడన్‌గా రైతు బాంధవులయ్యారు.. చంద్రబాబు,పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్‌ సెటర్లు..
Andhra CM Jagan Reddy

Updated on: May 12, 2023 | 12:51 PM

చంద్రబాబు, పవన్ ఇప్పుడు సడెన్‌గా రైతు బాంధవులయ్యారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సూటుబూటు వేసుకుని రైతు సంక్షేమపథకాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారని.. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఇప్పుడు ఆయనతోపాటు పవన్ పొలిటికల్ బాంధవుల అవతారం ఎత్తారని విమర్శించారు. తనకు ఓటు వెయ్యకపోయినా ఫర్వాలేదు.. సంక్షేమమే ముఖ్యమనే లక్ష్యంతో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు . పంటనష్టాల పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు, పవన్‌ను ఎద్దేవ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్‌ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశామన్నారు.  దీంతో భూములపై రైతులకు సర్వహక్కులు లభించాయన్నారు.

2,06,171 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కులు లభించాయని.. రూ.20 వేల కోట్ల మార్కెట్‌ విలువైన భూములకు సంపూర్ణ హక్కు లభించిందన్నారు. దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు విముక్తి పలికినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను కోలుకోని దెబ్బ కొట్టారని. చంద్రబాబు హయాంలో భూములు అమ్ముకునే పరిస్థితి లేదని.. చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు ఉంటుంది. ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాం. రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించాం.

రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను. ఇప్పటికే గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేశాం. గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాం. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం. భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నాం. ఈ నెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం.

ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందుబాటులోకి తెచ్చాం. దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేశాం. గతంలో ఎన్నడూ జరగని మంచి ఇప్పుడు రైతులకు జరుగుతుంది. నాలుగేళ్లుగా ప్రతి అడుగూ రైతన్నల కోసమే వేశాం. రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారని విమర్శించారు సీఎం జగన్.