CM Jagan: ఓవైపు ప్రశంసల జల్లు.. మరోవైపు వినతులు, విజ్ఞప్తులు.. ప్రధాని సభలో చతురత ప్రదర్శించిన సీఎం

విభజన గాయాలు ఇంకా మానలేదని.. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా పీఎంను రిక్వెస్ట్ చేశారు సీఎం.

CM Jagan: ఓవైపు ప్రశంసల జల్లు.. మరోవైపు వినతులు, విజ్ఞప్తులు.. ప్రధాని సభలో చతురత ప్రదర్శించిన సీఎం
PM Modi- CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 12, 2022 | 12:00 PM

ప్రధాని మోదీ విశాఖ పర్యటన సక్సెస్‌ అయింది. లక్షలాదిగా జనసందోహం తరలి వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి లక్షల మంది మోదీ సభ కోసం వచ్చారు. ఈ సభ ఏర్పాట్లపై ప్రధాని మోదీ ఫుల్‌ హ్యాపీగా కనిపించారు. వేదికపై తన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి జగన్‌తో సభ గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.  ఆంధ్రావర్సిటీ బహిరంగసభలో ఏపీ సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభించగానే జనం చప్పట్లతో హర్షద్వానాలు పలికారు. జనసంద్రానికి అభివాదం చేస్తూ జగన్‌ ప్రసంగించారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర జనం ప్రభంజనం మాదిరిగా మారిందన్నారు. ప్రధాని సాక్షిగా.. రాష్ట్రానికి కేంద్రం సహాయ సహకారాలు కావాలని కోరారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి తగిలిన గాయాలు మానలేదని గుర్తుచేశారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతి రూపాయి ఖర్చు చేస్తున్నామన్నారు. వంగపండు పాటను ఉటంకిస్తూ జనాన్ని ఉత్సాహపరిచారు జగన్. విభజన హామీలు, పోలవరం, ప్రత్యేకహోదా, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ విజ్ఞప్తులు పరిశీలించాలని విశాఖ సభలో సీఎం జగన్‌, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదన్నారు సీఎం జగన్‌. విశాఖ సభలో ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, బీజేపీ, మోదీతో మాకున్న అనుబంధం, రాజకీయాలు, పార్టీలకు అతీతమన్నారు.

పీఎం-సీఎం సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనం…

ఆంధ్రావర్సిటీ బహిరంగ సభ వేదిక సాక్షిగా ప్రధాని మోదీ ఐదు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తంగా పదివేల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగింది.  ఆంధ్రావర్సిటీ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నమూనాలను ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను సీఎం జగన్‌తో పాటు అధికారులు ప్రధానికి వివరించారు. ఒక్కో ప్రాజెక్టును నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగారు. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన భారీ బహిరంగసభకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏయూ గ్రౌండ్స్‌ ఏ మూల చూసినా జనసంద్రంగా మారింది. సభావేదికపైకి వచ్చిన ప్రధాని మోదీ.. అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. ఓ మహిళతో కాసేపు ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రావర్సిటీలో నిర్వహించిన సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్‌ కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రధాని ఏదో అడగ్గా.. నవ్వుతూ సమాధానమిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

విశాఖ రైల్వేస్టేషన్‌, ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు రోడ్లు రహదారులు అభివృద్ధి చేస్తున్నామన్నారు మోదీ. విశాఖ సిటీ చాల అందమైన నగరం..వ్యాపారులతో ఎంతోమంది ఉన్నారు.. విశాఖ పోర్ట్‌ పశ్చిమ ఏసియాలో పేరు గాంచిందన్నారు మోదీ. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఆంధ్ర ప్రజలు తమ సత్తా చాటుతున్నారన్నారు. పలు కీలక పదవులు, కంపెనీలో దూసుకుపోతున్నారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ