Andhra Pradesh: ప్రభుత్వ పథకాలను నిధులు విడుదల.. బటన్ నొక్కి రిలీజ్ చేసిన సీఎం

|

Jul 19, 2022 | 11:51 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలకు దూరమైన వారికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం...

Andhra Pradesh: ప్రభుత్వ పథకాలను నిధులు విడుదల.. బటన్ నొక్కి రిలీజ్ చేసిన సీఎం
Cm Jgan Released Funds
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలకు దూరమైన వారికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. 12 పథకాల్లో కొత్తగా 3,39,096 మంది లబ్ధిదారులకు, కంప్యూటర్ బటన్ నొక్కి రూ.137కోట్లు జమ చేశారు. తద్వారా కొత్తగా 3.39 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కలగనుంది. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం (CM Jagan) ఉద్ఘాటించారు. కొత్తగా 7,051బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా 2,99,085 మందికి పెన్షన్ కానుక అందించిన ముఖ్యమంత్రి.. ఏటా పెన్షన్ కానుక అదనపు సహాయం పెంచుతామని వివరించారు. పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక కాగా.. ఈ పథకాల కోసం నిధులను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) విడుదల చేశారు.

వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) వెల్లడించింది. ఏపీలోని విద్యార్థులను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా.. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్‌ సున్నితంగా హెచ్చరిక చేశారు. ప్రజల్లో గ్రాఫ్‌ పెంచుకోవాలని, 175 సీట్లు గెలిచి తీరాలని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు ఇవ్వడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఆ బాధ్యత తనదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..