
పాలనలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు.

బ్యాట్పట్టి రెండు బంతులు ఆడి ముఖ్యమంత్రి అభిమానులను అలరించారు.

కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో సీఎం జగన్ క్రికెట్ బ్యాట్ పట్టారు.

వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి.. ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు జగన్

ఎంపీ అవినాష్ బౌలింగ్ చేయగా.. రెండు బంతులు ఆడి అభిమానుల్ని అలరించారు. బ్యాట్, బంతిపై సీఎం జగన్ సంతకం చేశారు.

సీఎం జగన్ క్రికెట్ ఆడిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి