CM jagan: నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన.. స్కూల్ పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్న జగన్

ఆదోనిలో జగనన్న విద్యా దీవెన కింద స్కూల్ పిల్లలకు కిట్లు పంపిణీ చేయనునున్నారు ముఖ్యమంత్రి జగన్. వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి

CM jagan: నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన.. స్కూల్ పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్న జగన్
Cm Jagan

Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:52 AM

CM jagan Kurnool Tour: కర్నూలు జిల్లా ఆదోనిలో నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆదోని రానున్నారు. మొదట విమానంలో ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి ఆదోనికి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రానున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పట్టణమంతా ట్రాఫిక్  ను మల్లించారు. ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. సీఎం రక సందర్భంలో పోలీసులు కనివిని ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆదోనిలో జగనన్న విద్యా దీవెన కింద స్కూల్ పిల్లలకు కిట్లు పంపిణీ చేయనునున్నారు ముఖ్యమంత్రి జగన్.  వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభించుకుంటున్న తొలి రోజున సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. పట్టణంలోని మున్సిపల్‌ క్రీడా మైదానంలో సీఎం సభకు ఏర్పాట్లు చేశారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందని పలువురు నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..