CM Jagan: కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు జగన్ సర్కార్ ఆపన్న హస్తం.. కీలక ఆదేశాలు

|

Aug 19, 2021 | 3:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కారణంగా 6800 మంది చిన్నారులు తల్లితండ్రులను కోల్పోయినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వారిలో...

CM Jagan: కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు జగన్ సర్కార్ ఆపన్న హస్తం.. కీలక ఆదేశాలు
Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కారణంగా 6800 మంది చిన్నారులు తల్లితండ్రులను కోల్పోయినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వారిలో 4033 మంది పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 1659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టుగా గుర్తించింది. 2150 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టు విద్యాశాాఖ ప్రభుత్వానికి తెలిపింది. మిగిలిన 524 మంది శిశువులుగా అధికారులు గుర్తించారు. కోవిడ్ సమయంలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచితంగానే విద్యను అందించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఏపీ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది. కోవిడ్ కారణంగా ఇద్దరు తల్లితండ్రులు, లేదా ఎవరో ఒకర్ని కోల్పోయిన వారి వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో వారిని తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లో కొనసాగించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక తరహాలోనే యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందు కోసం అయ్యే వ్యయాన్ని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చింది. తల్లితండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల విషయంలో ఎలాంటి సమస్యనైనా మండల, డివిజనల్ విద్యాశాఖ అధికారులకు నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా స్థానిక  యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి.  ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆ విద్యార్థులను స్కూళ్ల నుంచి తొలగించరాదు. తొలగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లల చదువులు కొనసాగేలా చర్యలు చేపట్టాలి.  ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు కోవిడ్ బారినపడి తల్లిదండ్రులు మరణించి అనాధలైన పిల్లలకు కూడా సంరక్షణ కేంద్రాలలో వసతి కల్పించాలని సీఎం జగన్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఈ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటికి ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వర్క్స్‌ జరుగుతున్నాయి.

Also Read: ఆఫ్గన్ క్రైసిస్.. ఇండియాలో డ్రైఫ్రూట్స్‌ కొనాలంటే ఇక జేబులకు చిల్లులే

తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్