‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్.. మెరుగైన జీవనోపాధి.. సుస్థిర ఆదాయమే లక్ష్యం..
రాష్ట్రంలో ఆడపడుచులు తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా ఎదగడానికి చేపట్టిన జగనన్న జీవక్రాంతి పథకాన్ని గురువారం సీఎం జగన్ ప్రారంభించారు.
రాష్ట్రంలో ఆడపడుచులు తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా ఎదగడానికి చేపట్టిన జగనన్న జీవక్రాంతి పథకాన్ని గురువారం సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వీడియో సమావేశం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ఈరోజు నెరవేర్చాం. అక్కాచెల్లెమ్మలకు సరైన జీవనోపాధి, సుస్థిర ఆదాయం లక్షమే ఈ జగనన్న జీవక్రాంతి పథకం ముఖ్యం ఉద్దేశం. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రొత్సహించడం ద్వారా.. రైతుల్లో ఆర్థిక అభివృద్ది వస్తుంది. గత ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాయి. జగనన్న జీవక్రాంతి పథకాన్ని అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాడి రైతులకు, మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. ఈ పథకం కింద 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నామని.. రూ.1.869 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభించాం. మహిళలకు ఆర్థిక వనరులు పెరగాలని.. చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ.5,400 కోట్లు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చెస్తామన్నారు.