CM Jagan: ఇస్కాన్ ఆధ్వర్యంలో స్కూల్‌ పిల్లలకు మధ్యాహ్న భోజనం.. అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

|

Feb 18, 2022 | 12:49 PM

ఇస్కాన్ సంస్థ(Iskcon) ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ (Akshaya Patra) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. స్కూళ్లలో..

CM Jagan: ఇస్కాన్ ఆధ్వర్యంలో స్కూల్‌ పిల్లలకు మధ్యాహ్న భోజనం.. అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌
Cm Jagan At Akshayapatra
Follow us on

మంగళగిరి మండలం ఆత్మకూరులో(Atmakuru) ఇస్కాన్ సంస్థ(Iskcon) ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ (Akshaya Patra) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది. విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న భోజనవివరాలను.. సీఎంకు వివరించారు ఫౌండేషన్‌ ప్రతినిధులు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు ముఖ్యమంత్రి. ఇస్కాన్‌ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. అత్యాధునిక వంటశాలను రూ.70 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు.

ఇక్కడ ఇస్కాన్‌ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది. తాడేపల్లి మండలం కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు.. యువత కోసం శిక్షణ కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది.

మంగళ గిరి ఆత్మకూరు వద్ద ఒకేసారి 50 వేల మందికి భోజనం ఏర్పాటు చేసేందుకు అక్షయపాత్ర ఆధ్వర్యంలో నూతన భవానాన్ని నిర్మించినట్లుగా సీఎం వైఎస్‌ జగన్‌కు హరేకృష్ణ హరేరామ మూమెంట్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ (బెంగళూరు) మధు పండిట్‌ దాస్ వివరించారు. వీరితో పాటు ఇస్కాన్ సభ్యులు భారీగా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి: Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..