Andhra pradesh: కోటంరెడ్డి ఎపిసోడ్‌కు సీఎం జగన్‌ ఫుల్‌ స్టాప్‌.. నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జిగా..

సింహపురి వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసంతృప్తి గళం వినిపించిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సమన్వయ కర్తగా నియమించింది పార్టీ. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో...

Andhra pradesh: కోటంరెడ్డి ఎపిసోడ్‌కు సీఎం జగన్‌ ఫుల్‌ స్టాప్‌.. నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జిగా..
Jagan Mohan Reddy

Updated on: Feb 02, 2023 | 6:31 PM

సింహపురి వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసంతృప్తి గళం వినిపించిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సమన్వయ కర్తగా నియమించింది పార్టీ. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నేతలందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్‌. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్‌రెడ్డే నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేస్తారని చెప్పారు.

ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుత.. రూరల్‌ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇదే విషయమై బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి చంద్రబాబును కలిసి టిక్కెట్‌ హామీ తీసుకున్నారు. బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్‌ అంటూ మాట్లాడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలి, రెండేళ్లుగా ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ’ బాలినేని ఫైర్‌ అయ్యారు. నెల్లూరులో ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు.

ఇక కోటం రెడ్డిపై మాజీ మంత్రి పేర్ని నాని సైతం విరుచుకుపడ్డారు. తనను బాగా నమ్మిన సీఎం జగన్‌కు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. నాని. డిసెంబర్‌ 25న కోటంరెడ్డి చంద్రబాబును కలిశారని, అంతకు ముందు నుంచి లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఇవన్నీ టీడీపీ నేతలే చెబుతున్నారన్నారు. ట్యాపింగ్‌ ఆరోపణలన్నీ చంద్రబాబు స్కీమేనని సజ్జల అటాక్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..