CM Jagan: సీఎం జగన్ కాలికి గాయం.. బుధవారం ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఉదయం ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి మరింత పెరిగింది. దీంతో బుధవారం ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు.

CM Jagan: సీఎం జగన్ కాలికి గాయం.. బుధవారం ఒంటిమిట్ట పర్యటన రద్దు
CM Jagan

Updated on: Apr 04, 2023 | 8:28 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన రద్దు అయ్యింది. కాలినొప్పి కారణంగా బుధవారం వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. ఉదయం ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి మరింత పెరిగింది. గతంలో ఇలానే కాలికి గాయం కాగా.. చాలా రోజులపాటు సీఎం జగన్ ఇబ్బందిపడ్డారు. తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. దీంతో బుధవారం ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us