పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ దీక్షలపై కీలక కామెంట్స్ చేశారు. సీఎంని బూతులు తిట్టడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక అధికారంలోకి రాలేమని తేలిందని…అందుకే రాష్ట్రంలో గొడవలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. వీళ్లు దాడి చేస్తోంది.. ముఖ్యమంత్రి, ప్రభుత్వం మీద మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మీద దాడి చేస్తున్నారని అన్నారు. ఇలా ముఖ్యమంత్రిని తిట్టడం సరేనా పద్దతేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి,.. గొడవలు పెట్టాలని చూస్తున్నారని సీఎం చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి తల్లిని ఉద్దేశించి టీడీపీ నేతలు బూతులు తిడుతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అనైతికం.. అధర్మం అన్నారు. సంఘవిద్రోహ శక్తుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. సంఘ విద్రోహ శక్తులు రూపు మార్చుకున్నాయని.. రాష్ట్రం పరువు, ప్రతిష్ఠను కొందరు దిగజార్చుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసత్యాలు వద్దని డీజీపీ చెప్పినా లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడే ప్రస్తక్తే లేదన్నారు. సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, చీకట్లో ఆలయాల రథాలను తగలబెడుతున్నారని చెప్పారు.
Also Read: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్… ఉత్తర్వులు జారీ
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. సడన్‌గా టీడీపీలో చేరిన జీవీ రెడ్డి..