Auto Driver Sevalo: ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు.. వారి ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ..
ఆంధ్రప్రదేశ్‌లో 'ఆటోడ్రైవర్ల సేవలో పథకం' ప్రారంభమైంది.. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ప్రారంభించారు. అయితే.. ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వేర్వేరు ఆటోల్లో వేదిక దగ్గరకు వచ్చి.. అందరినీ ఆకట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆటోడ్రైవర్ల సేవలో పథకం’ ప్రారంభమైంది.. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ప్రారంభించారు. అయితే.. ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వేర్వేరు ఆటోల్లో వేదిక దగ్గరకు వచ్చి.. అందరినీ ఆకట్టుకున్నారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా సింగ్‌నగర్ వరకు ముగ్గురు నేతలు ప్రయాణించారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలతో కలిసి ఆటోల్లో ప్రయాణిస్తూ సమస్యలపై ఆరా తీశారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా.. అర్హులైన ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం కోసం రూ.435కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 లక్షల 90 వేల 234 మంది అర్హులకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు చొప్పున జమ చేసింది. ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం కింద ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని.. ప్రత్యేకమైన యాప్ తీసుకొస్తామని అన్నారు. టెక్నాలజీతో వచ్చే లాభాలు వారికే దక్కేలా చూస్తామన్నారు.
రాష్ట్రంలో మళ్లీ దుష్టశక్తులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. మరోసారి వైకుంఠపాళి తరహా పరిస్థితులు రాకూడదని.. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే మీ ఆశలు నెరవేరుతున్నాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
