CM Chandrababu: విజయవాడలో ఖాదీ సంత కార్యక్రమం.. ముఖ్య అథితిగా హాజరైన సీఎం చంద్రబాబు

విజయవాడలోని యస్.యస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఖాధీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.

CM Chandrababu: విజయవాడలో ఖాదీ సంత కార్యక్రమం..  ముఖ్య అథితిగా హాజరైన సీఎం చంద్రబాబు
Cm Chandrababu

Updated on: Oct 02, 2025 | 6:55 PM

విజయవాడలోని యస్.యస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఖాధీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మహనీయుల గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారికి సీఎం చంద్రబాబు పూజలు నిర్వహించారు.

తెలంగాణలో సమీ వృక్ష పూజను చాలా బాగా చేస్తారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
సమీ వృక్ష ఆకులను తెల్ల బంగారంగా అభివర్ణిస్తారని, శత్రువుల అంతా నాశనం అవ్వాలని జేబుల్లో వేసుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు.దసరా రోజు పాల పిట్టను చూస్తే మంచి జరుగుతుందని.. అందుకే ఈ రోజు పాలపిట్టను చూడాలని చాలా మంది అనుకుంటారని చంద్రబాబు గుర్తుచేశారు.

ఆ తర్వాత ఖాధీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి, అక్కడ ఉన్న చేతి వృత్తుల వారితో మాట్లాడి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాధ్,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మధుకర్ జీ, రమేష్ నాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు పాల్గొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.