AP News: ఏపీలో పెన్షన్ల పండుగ.. తొలి రోజే 96 శాతం పంపిణీ పూర్తి

|

Aug 01, 2024 | 5:58 PM

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టగా.. దాదాపు 96 శాతం కంప్లీట్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP News: ఏపీలో పెన్షన్ల పండుగ.. తొలి రోజే 96 శాతం పంపిణీ పూర్తి
Ap Pensions Distribution
Follow us on

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టగా.. దాదాపు 96 శాతం కంప్లీట్ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరగ్గా.. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో పంపిణీ చేశారు అధికారులు. ఇక.. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.

ఈ నెలకు సంబంధించి 64లక్షల 82వేల మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోంది. అందుకోసం 2వేల 737 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇక.. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. అధికారులే ఇంటికి వచ్చి 4వేల రూపాయల పెన్షన్‌ అందిస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పెన్షన్ల పంపిణీలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ప్రతి జిల్లా కేంద్రంలోని DRDA కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.