నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు వెయ్యి పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టల కోసం నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న వార్తలు నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టులు దాదాపు 100కి పైగా ఉండగా, గ్రూప్ 2 పోస్టులు 900కిపైగా ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే సిలబస్ మార్పులపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతమైతే ప్రాథమికంగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారులు గ్రూప్ 1,2లో ఏయే పోస్టులను భర్తీ చేయనున్నారు, సిలబస్ ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై జీవో జారీ చేస్తారని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..