Political Clash: కర్నూలు జిల్లాలో రాజుకుంటున్న రాజకీయాలు.. ఎగసిన కత్తులు.. ఫ్యాక్షన్ సీన్‌ను తలపించిన ఫైట్లు..

|

Jan 17, 2021 | 9:16 PM

Political Clash: కర్నూలు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని డోన్ పట్టణం పాతపేటలో వైసీపీకి చెందిన ఇరు వర్గాల..

Political Clash: కర్నూలు జిల్లాలో రాజుకుంటున్న రాజకీయాలు.. ఎగసిన కత్తులు.. ఫ్యాక్షన్ సీన్‌ను తలపించిన ఫైట్లు..
Follow us on

Political Clash: కర్నూలు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని డోన్ పట్టణం పాతపేటలో వైసీపీకి చెందిన ఇరు వర్గాల యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు కత్తిపోట్లు దిగాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి చికిత్స చేస్తున్నారు. అయితే, ఈ ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సదరు బాధితుడిని పెద్దాస్పత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఘనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. కర్నూలు జిల్లాలోనే మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సంజామల మండలం నట్లకొత్తూరు గ్రామంలో భూతగాదాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులు గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో గాయపడిన కోయిలకుంట్ల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీసీ జనార్థన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ కార్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read:

IRFC IPO : ఐపీఓలోకి తొలిసారి ప్రభుత్వ రంగ సంస్థ ఎంట్రీ .. ఒక్కో షేరు ధర రూ.25 ఉండే ఛాన్స్

Tellam Balaraju dance: పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డ్యాన్స్‌.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా డీజే స్టెప్పులు