Andhra Pradesh: మెడికల్ కాలేజీ తెచ్చిన తంటా కారణంగా కర్నూలు జిల్లాలో రెండు కీలక కుటుంబాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. నంద్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైంది. ఈ కాలేజీని ఎక్కడ నిర్మించాలనే దానిపై వివాదం నడుస్తో్ంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన భూమా, శిల్పా కుటుంబాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. బ్రిటీష్ పరిపాలనా కాలంలోనే దీనిని ఏర్పాటు చేశారు. ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే రికార్డ్ స్థాయిలో అనేక నూతన వంగడాలు రూపొందించారు.
అనేక అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అయితే, ఈ క్షేత్రానికి ఉన్న 110 ఎకరాల స్థలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనులను ప్రారంభించారు. దీంతో విపక్ష పార్టీలకు చెందిన నేతలు భగ్గుమన్నారు. మెడికల్ కాలేజీని అక్కడ నిర్మించొద్దని డిమాండ్ చేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వ్యవసాయ క్షేత్రాన్ని నీరు గార్చవద్దని, మెడికల్ కాలేజీని మరో చోట ఏర్పాటు చేయాలని వైసీపీ మినహా.. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆ మేరకు ఉద్యమం చేపట్టాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. రోజు రోజుకు ఇది తీవ్రమవుతుండటంతో.. వివాదం ఎక్కడికి దారి తీస్తుందో అనే చర్చ జరుగుతోంది.
Also read:
Car in Flood Video: వరదలో కొట్టుకుపోతున్న కారును తాడుతో పక్కకు లాగిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో..
Ravana Funny Dance Video: రామ్‌లీలాలో రావణుడి ఫన్నీ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..
Israel: ఇజ్రాయిల్ చారిత్రాత్మక నిర్ణయం.. 4 వేల మంది పాలస్తీనా ప్రజలకు గుర్తింపు కార్డులు!